logo

ఏళ్లు గడుస్తున్నా.. పరిహారం అందలేదు

పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు తమ భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్న నేటికి పరిహారం అందించలేదని తమకు న్యాయం జరిగేలా చూడాలని గిరిజనేతర రైతులు కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 17 Apr 2024 06:06 IST

నెహ్రూని కలిసిన పోలవరం భూ నిర్వాసిత రైతులు

నెహ్రూకు వినతిపత్రం అందజేస్తున్న రైతులు

గోకవరం, జగ్గంపేట, న్యూస్‌టుడే: పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు తమ భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్న నేటికి పరిహారం అందించలేదని తమకు న్యాయం జరిగేలా చూడాలని గిరిజనేతర రైతులు కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలానికి చెందిన పలువురు రైతులు మంగళవారం జగ్గంపేటలో తెదేపా కార్యాలయం వద్దకు వచ్చి కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూను కలిశారు. రైతులు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్వం నుంచి తమకు భూములు ఉన్నాయని పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురైన నిర్వాసితులకు కాలనీల నిర్మాణాలు, భూమికి భూమి ఇచ్చేందుకు తమ వద్ద నుంచి భూములు తీసుకున్నారన్నారు. తీసుకునే సమయంలో నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పారని తీరా తీసుకున్న తరువాత పరిహారం చెల్లించకపోగా వైకాపా పాలనలో మాపై కేసులు పెట్టారని వాపోయారు. దీనిపై నెహ్రూ స్పందిస్తూ.. త్వరలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు ఎస్‌.వి.ఎస్‌.అప్పలరాజు, కందుల చిట్టిబాబు తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని