logo

కూటమి ఐక్యత అన్ని నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలి: నాగబాబు

పిఠాపురంలో జనసేన, తెదేపా, భాజపా కూటమి శ్రేణుల ఐక్యత ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు.

Published : 17 Apr 2024 06:07 IST

మాట్లాడుతున్న నాగబాబు

పిఠాపురం: పిఠాపురంలో జనసేన, తెదేపా, భాజపా కూటమి శ్రేణుల ఐక్యత ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. మంగళవారం  కుమారపురంలోని హోటల్‌ గోకులం గ్రాండ్‌లో కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే  వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జగన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలను బానిసలుగా చూస్తున్నారని విమర్శించారు. తనను తాను రాజుగా ఊహించుకుంటూ సంక్షేమ పథకాలు తానేదో దానం చేస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వస్తే సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థులైనప్పటికీ సిద్ధాంతపరంగానే పోరాటం సాగించారన్న నాగబాబు.. జగన్‌ మాత్రం అసెంబ్లీలో బూతులు మాట్లాడిస్తూ, చంద్రబాబును తిట్టించి సంతోషపడుతున్నాడన్నారు. అనంతరం వర్మ మాట్లాడుతూ కూటమి బలాన్ని ప్రదర్శించేందుకు అందరూ కలసి రావాలన్నారు.   వేములపాటి అజయ్‌ కుమార్‌, మర్రెడ్డి శ్రీనివాసు, శంకర్‌ గౌడ్‌, బన్నీ వాసు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని