logo

అద్దె చెల్లించక అగచాట్లు

వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్‌వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 19 Apr 2024 04:53 IST

కాకినాడ నగరంలో ఓ అంగన్‌వాడీ కేంద్రం

న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్‌(కాకినాడ): వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్‌వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే అంతంత మాత్రంగానే ఉన్న జీతాలు.. ఆపై ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. దీంతో అప్పులు చేసి కుటుంబ భారాన్ని నెట్టుకు రావాల్సిన దుస్థితి. ఇది చాలదన్నట్లుగా కేంద్రాల నిర్వహణ ఖర్చు భారంగా మారడంతో లబోదిబోమంటున్నారు.

3 నెలలుగా బకాయిలు

పరాయి పంచన నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు మూడు నెలలుగా అద్దె చెల్లించడం లేదు. దీంతో భవన యజమానులు సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ప్రీ స్కూల్‌ పిల్లలకు వండి పెట్టేందుకు రోజూ ఆకుకూరలు, కూరగాయలు, కారం, చింతపండు, పసుపు, ఇతర పోపు సామాన్లు కొనుగోలు చేయాలి. వీటికి నెలనెలా కేంద్రంలోని పిల్లలను బట్టి రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చవుతోంది. వీటి బిల్లులూ రెండు నెలలుగా బకాయి ఉన్నాయి.

సమ్మె వేతనం ఏదీ..?

డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ సిబ్బంది గత ఏడాది చివరిలో 42 రోజులపాటు సమ్మె చేశారు. సమ్మె కాలానికి సంబంధించి వేతనం చెల్లిస్తామని చెప్పినా ఇంత వరకు ఇవ్వలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని