సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు.
మాట్లాడుతున్న రాజేంద్రప్రసాద్
వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం): ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధి గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధులు పలువురు గురువారం రాజమహేంద్రవవరంలోని రివర్‌బే హోటల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని, సుమారు రూ.36 వేల కోట్ల నిధులను ఇతర పథకాలను మళ్లించిందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం, 14, 15 ఆర్థిక సంఘం, జలజీవన్ మిషన్ నిధులను దారి మళ్లించడం వల్ల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సమకూరక ప్రజలు మండిపడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధులు నాగాబత్తుల శాంతకుమారి, సుబ్బారావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని, స్థానిక పంచాయతీలకు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులకు దామాషా పద్ధతితో నిధులు విడుదలలో జాప్యం చేస్తూ వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, జనసేన నాయకుడు ఉప్పులూరు బాబ్జి, భాజపా నాయకులు పరిమి రాధ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సంఘం నాయకురాలు శాంతకుమారి, పశ్చిమగోదావరి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాలడుగుల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్‌లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
-
మ్యాన్‌హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు