logo

జగ్గంపేటలో చంద్రబాబు బహిరంగ సభ నేడు

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తెదేపా అధినేత చంద్రబాబు జగ్గంపేటలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు.

Published : 22 Apr 2024 05:38 IST

కాకినాడ నగరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తెదేపా అధినేత చంద్రబాబు జగ్గంపేటలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్‌లో 3.15 గంటలకు జగ్గంపేటలోని కోడూరి రంగారావు మైదానంలో దిగుతారు. రోడ్డుమార్గాన 3.25 గంటలకు జగ్గంపేటలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీప కూడలి వద్దకు చేరుకోనున్న ఆయన.. 3.30 గంటల నుంచి 5 గంటల వరకు అక్కడ జరిగే సభలో పాల్గొంటారు.అనంతరం రోడ్డు మార్గాన హెలీప్యాడ్‌కు వచ్చి 5.20కు బయలుదేరి సాయంత్రం 6.05 గంటలకు విజయనగరం జిల్లా రంగరాయపురం చేరుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని