logo

పెళ్లి మండపంలో వధువు అపహరణకు యత్నం

వివాహ వేడుకలో కారం చల్లి నవవధువును అపహరించే ప్రయత్నం జరిగిన ఘటన కడియం మండలం, కడియంలో చోటుచేసుకుంది. ఆ మేరకు కడియం సీఐ తులసీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 22 Apr 2024 05:39 IST

కారం చల్లి దాడి చేశారని ఫిర్యాదు

కడియం, న్యూస్‌టుడే: వివాహ వేడుకలో కారం చల్లి నవవధువును అపహరించే ప్రయత్నం జరిగిన ఘటన కడియం మండలం, కడియంలో చోటుచేసుకుంది. ఆ మేరకు కడియం సీఐ తులసీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం, గొడిగనూరు గ్రామానికి చెందిన గంగవరం స్నేహ, కడియం గ్రామానికి చెందిన బత్తిన వెంకటనందు కలిసి నరసరావుపేటలోని ఓ కళాశాలలో పశువైద్యంలో డిప్లొమా చదివారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమకు దారితీయడంతో ఈ నెల 13న విజయవాడలోని దుర్గగుడిలో వివాహం చేసుకున్నారు. అనంతరం కడియం వచ్చి బత్తిన వెంకటనందు తన ఇంట్లో చెప్పగా పెద్దలు అంగీకరించి, బంధువుల సమక్షంలో మరోసారి వివాహం చేసేందుకు ఈ నెల 21న ముహూర్తం నిర్ణయించారు. అదే విషయాన్ని వధువు తన తల్లిదండ్రులకు తెలిపింది. కడియంలోని ఓ ఫంక్షన్‌ హాలులో ఆదివారం తెల్లవారు జామున వివాహ ప్రక్రియ జరుగుతుండగా వధువు తరఫున వాళ్లు పద్మావతి, చరణ్‌కుమార్‌, చందు, నక్కా భరత్‌ ఒక్కసారిగా ప్రవేశించి అక్కడున్న వారిపై కారంచల్లి స్నేహను అపహరించేందుకు ప్రయత్నించారు. దీంతో వెంకటనందు వారిని అడ్డుకున్నారు. ఈ దాడిలో బత్తిన వీరబాబుకు తీవ్రంగా గాయాలు కాగా చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ మేరకు దాడి, అపహరణ, బంగారం చోరీ తదితర ఫిర్యాదలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని