logo

ఎన్నికల వ్యయాలపై ప్రత్యేక దృష్టి

అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయాలపై ప్రత్యేక దృష్టిసారించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనానిగమ్‌ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో ఎన్నికల వ్యయ పరిశీలకులు, సమన్వయ కమిటీలు, నోడల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Published : 22 Apr 2024 05:54 IST

అధికారులకు సూచనలిస్తున్న రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనానిగమ్‌, చిత్రంలో కలెక్టర్‌, ఎస్పీ

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌: అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయాలపై ప్రత్యేక దృష్టిసారించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనానిగమ్‌ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో ఎన్నికల వ్యయ పరిశీలకులు, సమన్వయ కమిటీలు, నోడల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నామినేషన్ల పర్వం ప్రారంభమైన దృష్ట్యా తనిఖీలు ముమ్మరం చేయాలని, సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులు చేసే ఎన్నికల ఖర్చులను వారి ఖాతాల్లో చూపడంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. రిజిస్టర్‌, నాన్‌రిజిస్టర్‌ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ప్రచార ఖర్చులు, బహుమతుల పంపిణీ, అనుమానాస్పద, భారీ మొత్తంలో జరిగే నగదు లావాదేవీలు, డిపాజిట్లపై దృష్టి పెట్టాలన్నారు. మద్యం అమ్మకాలు, స్టాక్‌ పాయింట్ల నుంచి దుకాణాలకు సరకు రవాణాపై నిఘా ఉంచాలన్నారు. ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న అనుకూల, ప్రతికూల కథనాలు, చెల్లింపు వార్తలు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలను ప్రత్యేక బృందాల ద్వారా రికార్డు చేసి వాటి ఆధారంగా వ్యయాలను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ జగదీష్‌ మాట్లాడుతూ జిల్లాలో తొలుత 8 సమీకృత చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, తర్వాత అదనంగా మరో 8 ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌, డీఆర్వో నరసింహులు  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు