logo

అన్నవరం దేవస్థానంలో శాస్త్రోక్తంగా నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ

కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో నూతన ధ్వజ స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా  నిర్వహించారు.

Updated : 22 Apr 2024 13:59 IST

అన్నవరం :  కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో నూతన ధ్వజ స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా  నిర్వహించారు. ఆలయంలోని అనివేటి మండపంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం  ధ్వజ స్తంభ ప్రతిష్ఠ చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఛైర్మన్ రోహిత్, ఈవో రామచంద్ర మోహన్ ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు. నెల్లూరుకు చెందిన ఓ దాత సహకారంతో ఆలయంలో బంగారు ధ్వజస్తంభం ఏర్పాటు చేయనున్నారు.  బంగారు తాపడం పనులు చేపడతారు. సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో సుమారు 1.5 కేజీల బంగారంతో   ఈ పనులు చేపట్టనున్నారు. జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన ఆలయంలో స్వామి, అమ్మవారు, పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్ఠ కూడా అత్యంత వైభవంగా జరిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని