logo

విద్యుదాఘాతంతో మహిళ మృతి

విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.

Published : 18 May 2024 02:49 IST

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటన అనపర్తి మండలం కుతుకులూరులోని కుటేశ్వరకాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కుటేశ్వరకాలనీలో గతంలో ఓ వైకాపా నాయకుడు బస్టాండ్‌ నిర్మించారు. దానికి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి విద్యుత్తు సరఫరా తీగ ఏర్పాటు చేశారు. అయితే కుటేశ్వరస్వామి ఆలయం వెనుక ఉన్న నాగుల పుట్టపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెపై ఈ విద్యుత్తు తీగ పడింది. అదే సమయంలో రామతారకం ఇంట్లో చెత్తను పారవేసేందుకు వెళ్లి ఇనుప కంచెను పట్టుకోవడంతో ఆమె విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. దీంతో ఆమె కుమారుడు ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి అనధికారికంగా విద్యుత్తు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని