logo

భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..

సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి.

Published : 18 May 2024 02:58 IST

చిన్నశేషవాహనంపై తిరువీధి ఉత్సవం
వైభవంగా కల్యాణోత్సవాలు ప్రారంభం

పుప్పాలంకరణలో శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి

సర్పవరం (సర్పవరంజంక్షన్‌), న్యూస్‌టుడే: సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. ఆలయ పరిసరాలు స్వామివారి నామస్మరణతో మార్మోగాయి. కల్యాణ కారకులైన స్వామివారు, అమ్మవారు వధూవరులుగా ముస్తాబు కావడంతో భక్తకోటి పులకించింది. ఈవో భీమశంకరరావు స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. 8 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో మొదటి రోజు శుక్రవారం నిత్యపూజా కార్యక్రమాలు, బాలభోగం, నివేదన, నిత్యహోమం, నిత్య సేవాకార్యక్రమాలు, ధ్వజారోహణ, ధ్వజపటాష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు స్వామి వారిని చిన్న శేష వాహనంపై ఉంచి తిరువీధి గ్రామోత్సవం నిర్వహించారు. స్వామి వారి గరుడు ప్రసాదం స్వీకరిస్తే సంతానప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. నేడు స్వామికి పెద్ద శేష వాహనంపై వేంచేసి తిరువీధి ఉత్సవాన్ని జరుపుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని