logo

మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం

అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది.

Updated : 18 May 2024 05:18 IST

ఉత్సవ ప్రారంభం నేడే..

గ్రామోత్సవ సేవలకు వెండి వాహనాలు 

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. ఈనెల 24 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వామిఅమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలను చేసే వేడుక శనివారం ఉంటుంది. 19 (ఆదివారం) రాత్రి స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహిస్తారు. స్వామి, అమ్మవార్లను గరుడ, గజ, రావణ, పొన్నవాహన సేవ, రథోత్సవం తదితర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి.

ఈరోజు: సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లను వధూవరులునుగా చేసే ఘట్టం నిర్వహించేందుకు ప్రధానాలయం వద్ద అనివేటి మండపాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం కల్యాణ వేదికపై సందడిగా సాగనుంది. పండితులు, అర్చకులు, పురోహితుల బృందం రెండు వర్గాలుగా కల్యాణమూర్తులను..  కీర్తిప్రతిష్ఠలు, గుణగణాలు, వంశాల విశిష్టత ఛలోక్తుల నడుమ కీర్తిస్తూ సరదాగా ఈ కార్యక్రమం సాగుతుంది. రెండు బృందాలు పరస్పరం తాంబూలాలు మార్చుకుని శుభఘడియలను పండితుల సమక్షంలో నిర్ణయిస్తారు. రాత్రి 9 గంటలకు పెళ్లి పెద్దలు సీతారాముల వారికి వెండి ఆంజనేయ వాహనంపై ఆసీనులను చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. సత్యదేవుని క్షేత్రపాలకులుగా కొలుస్తూ వారినే ఈ దివ్యకల్యాణానికి పెళిల పెద్దలుగా వెండి  ఆంజనేయ వాహనంపై ఊరేగిస్తారు. అందర్నీ ఆహ్వానించేందుకు ఈ ఊరేగింపు ఆనవాయితీగా వస్తుందని పండితులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు