logo

రావణబ్రహ్మపై ఊరేగిన సత్యదేవుడు

అన్నవరం సత్యదేవునికి సోమవారం రాత్రి రావణ బ్రహ్మ వాహన సేవను వైభవంగా నిర్వహించారు.

Published : 21 May 2024 05:48 IST

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యదేవునికి సోమవారం రాత్రి రావణ బ్రహ్మ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవాల్లో భాగంగా జరిగిన గ్రామోత్సవాన్ని దేవస్థానం కమిటీ ఛైర్మన్‌ ఐవీ రోహిత్‌ ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటైన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దర్బారు మండపంలో ప్రవేశ స్థాలీపాక హోమాలు నిర్వహించారు. అనంతరం రాత్రి 7 గంటలకు ఉత్సవమూర్తులను తూర్పురాజగోపురం వద్దకు తోడ్కొని వచ్చి అర్చకులు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించారు. 
మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సదస్యం, పండిత సత్కారం (వేద సభ), రాత్రి 9 గంటల నుంచి పొన్న వాహనసేవ నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. 
సూర్య భగవానుడికి పూజలు: ఆదివారం రాత్రి జరిగిన సత్యదేవుని కల్యాణానికి తదుపరి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకమూ లేకుండా వరుణుడు కరుణించడం, కల్యాణం కనుల పండువగా పూర్తి కావడంతో సోమవారం తూర్పురాజగోపురం వద్ద దేవాదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ, ఈవో రామచంద్రమోహన్, వైదిక బృందం సూర్య భగవానుడికి బూర్లు పైకి విసిరి నైవేద్యంగా సమర్పించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని