logo

కన్నవారి కనీస అవసరాలు తీర్చాల్సిందే...

కన్నవారి కనీస అవసరాలు తీర్చకపోయినా, వారితో అగౌరవంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉందని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.ప్రకాష్‌బాబు అన్నారు

Published : 21 May 2024 05:57 IST

వృద్ధుడికి గుర్తింపుకార్డు అందజేస్తున్న న్యాయమూర్తి ప్రకాష్‌బాబు 

దానవాయిపేట (రాజమహేంద్రవరం): కన్నవారి కనీస అవసరాలు తీర్చకపోయినా, వారితో అగౌరవంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉందని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.ప్రకాష్‌బాబు అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంలో వయోవృద్ధుల హక్కుల పరిరక్షణపై వివిధ శాఖల అధికారులు, ఎన్‌జీవో సంస్థలతో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న న్యాయమూర్తి మాట్లాడుతూ వయసు పైబడిన తల్లిదండ్రులను మర్యాదగా, ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉంటుందన్నారు. వృద్ధులు తమ హక్కులకు డీఎల్‌ఎస్‌ఏ, ఆర్‌డీవో ట్రైబ్యునల్‌లో సంప్రదించాలన్నారు. అనంతరం 35 మందికి గుర్తింపుకార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సినియర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్, వివిధ ఎన్‌జీవో సంస్థల సభ్యులు, పారాలీగల్‌ వాలంటీర్లు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని