logo

కేంద్ర కారాగారానికి జీవవైవిధ్య పరిరక్షణ పురస్కారం

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం జీవవైవిధ్య పరిరక్షణ అవార్డు-2024(బయోడైవర్సిటీ కన్జర్వేషన్‌)కు ఎంపికైనట్లు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 21 May 2024 05:58 IST

దానవాయిపేట(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం జీవవైవిధ్య పరిరక్షణ అవార్డు-2024(బయోడైవర్సిటీ కన్జర్వేషన్‌)కు ఎంపికైనట్లు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యావరణ సమతుల్యతకు అనువైన మొక్కలు, పక్షులు, పురాతన వారసత్వ కట్టడాలు, సోలార్‌ వినియోగం, సేంద్రియ ఎరువుల వాడకం, నీటివనరుల సంరక్షణ, కుండల్లో మంచినీటి వాడకం, నూలు దారాలతో ఖద్దరు దుస్తుల తయారీ వంటి వివిధ సంప్రదాయ పద్ధతుల్లో వస్తువుల తయారీ తదితర అంశాలను పరిశీలించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ఈ అవార్డును ఇస్తుందన్నారు. ఈ నెల 22న విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్జర్వేషన్‌ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో దీన్ని ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.్చ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని