logo

కౌంటింగ్‌ ప్రక్రియ ఏర్పాట్లపై పర్యవేక్షణ

నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డా.కె.మాధవీలత అన్నారు.

Published : 21 May 2024 06:00 IST

ఎస్పీ తదితరులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ మాధవీలత 

రాజానగరం, న్యూస్‌టుడే: నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డా.కె.మాధవీలత అన్నారు. సోమవారం సాయంత్రం ఎస్పీ పి.జగదీష్‌తో కలసి నన్నయలో ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు. కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించడంలో జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన ఏర్పాట్ల విషయంలో కచ్చితత్వం పాటించే విధానంలో చేపట్ట వలసిన వాటిపై దిశా నిర్దేశం చేశామన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద నిర్వహించే విధులపై చర్చించామన్నారు. అనంతరం విజిటింగ్‌ రిజిస్టర్‌లో వారు సంతకం చేశారు. రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం గ్రామీణం, రాజానగరం, కొవ్వూరు, తదితర స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న తీరును ఎస్పీతో కలసి పరిశీలన చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి కౌంటింగ్‌ కేంద్రానికి బ్యాలట్‌ యూనిట్స్, ఇతర అనుబంధ పత్రాలు భద్రపరచిన గది నుంచి తీసుకురావాల్సిన రూట్‌ మ్యాప్‌పై చర్చించారు. సంబంధిత ఏర్పాట్లపై రిటర్నింగ్‌ అధికారులు జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌భరత్, మున్సిపల్‌ కమిషనర్‌ దినేష్‌కుమార్‌లు కలెక్టర్‌ కు వివరించారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ, ఆర్డీఓ చైత్రవర్షిణి, అదనపు ఎస్పీ ఎల్‌.చెంచురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని