logo

ఓట్ల లెక్కింపులో నిబంధనలు పాటించాలి

జూన్‌ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదేశించారు.

Published : 21 May 2024 06:05 IST

రాజమహేంద్రవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జూన్‌ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కౌంటింగ్‌ ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపుపై ఆర్వోలు, ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కౌంటింగ్‌ హాల్‌లోకి రిటర్నింగ్‌ అధికారి మాత్రమే చరవాణి తేవడానికి అనుమతి ఉందన్నారు. నన్నయ యూనివర్సిటీ ఆవరణలోకి ఎటువంటి వాహనాలు అనుమతించడం లేదన్నారు. ప్రక్రియ పరిశీలన కోసం ఎస్కార్ట్‌ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒక్కో కౌంటింగ్‌ కేంద్రంలోకి గరిష్ఠంగా 14 మంది ఎలక్షన్‌ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారన్నారు. శాంతియుత విధానంలో కొనసాగేందుకు అందరూ సమష్టి బాధ్యత వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్‌ ఆర్వో, జేసీ ఎన్‌.తేజ్‌భరత్, అర్బన్‌ ఆర్వో, మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్, కొవ్వూరు ఆర్వో, సబ్‌కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ్, డీఆర్వో జి.నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని