logo

ర్యాలీ, సభ, సమావేశాలకు అనుమతులు లేవు: ఎస్పీ జగదీష్‌

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంతవరకు జిల్లాలో ర్యాలీలు, ఊరేగింపులు, జాతరలు వంటి వాటితోపాటు సభలు, సమావేశాలకు ఎటువంటి అనుమతులు లేవని ఎస్పీ పి.జగదీష్‌ స్పష్టం చేశారు.

Published : 25 May 2024 03:25 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ జగదీష్‌
దానవాయిపేట(రాజమహేంద్రవరం): ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంతవరకు జిల్లాలో ర్యాలీలు, ఊరేగింపులు, జాతరలు వంటి వాటితోపాటు సభలు, సమావేశాలకు ఎటువంటి అనుమతులు లేవని ఎస్పీ పి.జగదీష్‌ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని హెచ్చరించారు. నన్నయ విశ్వవిద్యాలయం వద్ద ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ, ముందస్తు భద్రత ఏర్పాట్లపై జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో ఎస్పీ సమీక్షించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బాణసంచా విక్రయాలు, తయారీ, కాల్చడం వంటివి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు నిషేధించామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి అల్లర్లకు తావులేకుండా మూడంచెల భద్రత ఉండాలన్నారు. లెక్కింపు రోజున రూఫ్‌ టాప్‌ బందోబస్తు, ట్రాఫిక్‌ రెగ్యులేషన్, వాహనాల పార్కింగ్‌ వంటి వాటికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫలితాల అనంతరం ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ముందస్తు చర్యలు, పెట్రోలింగ్‌ నిర్వహించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. సమీక్షలో ఏఎస్పీలు పి.అనిల్‌ కుమార్, ఎస్‌ఆర్‌ రాజశేఖర్‌ రాజు, ఎల్‌.చెంచిరెడ్డి, జోనల్‌ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని