logo

అంతర్జాతీయంగా దేశీయ పొగాకుకు డిమాండ్‌

దేశంలో పొగాకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయని పొగాకు బోర్డు ఛైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 25 May 2024 03:50 IST

బోర్డు ఛైర్మన్‌కు వినతిపత్రాన్ని అందిస్తున్న రైతు నాయకులు 

దేవరపల్లి: దేశంలో పొగాకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయని పొగాకు బోర్డు ఛైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ పేర్కొన్నారు. డిమాండ్, ఎగుమతులు బట్టి ధర బాగుందని, పంటను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు. శుక్రవారం దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత రెండు, మూడేళ్ల కన్నా ఈసారి ధర బాగుందన్నారు. రాష్ట్రంలో పొగాకు వేలం కేంద్రాలు ప్రారంభించినప్పటి నుంచి అన్ని కేంద్రాల్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. ఎన్‌ఎల్‌ఎస్‌ ఏరియాలో హైగ్రేడ్‌ పొగాకు ధర కిలో ప్రస్తుతం రూ.331 ఉందన్నారు. దేశీయ పొగాకుకు అంతార్జాతీయంగా మంచి గుర్తింపు ఉందన్నారు. ప్రస్తుతం బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో వాతావరణం అనుకూలించక దిగుబడి తగ్గిందన్నారు.  ఈ క్రమంలో సుమారు 200 మిలియన్ల పొగాకు అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ సంస్థలు మన పంటకు మొగ్గు చూపుతున్నారన్నారు. కొత్తగా పొగాకు లైసెన్సులు ఇచ్చే అవకాశం లేదన్నారు. పొగాకు సీడ్‌ విషయంలో బోర్డులు జోక్యం చేసుకోదన్నారు. లోగ్రేడ్‌ పొగాకు కొనట్లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. బోర్డు రాజమహేంద్రవరం రీజనల్‌ మేనేజర్‌ ఆదిశేషయ్య, దేవరపల్లి బోర్డు నిర్వహణ అధికారి జీఎల్‌కే ప్రసాద్, రైతులు కరుటూరి శ్రీనివాస్, సుంకవల్లి రాము, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని