logo

27 నుంచి పాలిటెక్నిక్‌ ధ్రువపత్రాల పరిశీలన

పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ పాలిసెట్‌కు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుందని కాకినాడలోని ఆంధ్రా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ నల్లి జనార్దనరావు తెలిపారు.

Published : 26 May 2024 03:04 IST

గాంధీనగర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ పాలిసెట్‌కు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుందని కాకినాడలోని ఆంధ్రా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ నల్లి జనార్దనరావు తెలిపారు. సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు 24వ తేదీ నుంచి జూన్‌ 2 వరకు ఏపీ పాలిటెక్నిక్‌కు చెందిన వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలన్నారు. ర్యాంకుల వారీగా ఈ నెల 27 నుంచి జూన్‌ 3వ తేదీ వరకూ సమీపంలోని కేంద్రాల్లో(హెల్ప్‌లైన్‌ సెంటర్‌) ధ్రువపత్రాల పరిశీలనకు నేరుగా హాజరు కావాలన్నారు. ఈ నెల 31 నుంచి జూన్‌ 5 వరకు ఆప్షన్లు నమోదుకు, 5న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉందన్నారు. జూన్‌ 7న సీట్లు కేటాయిస్తారన్నారు. కౌన్సెలింగ్‌కు ప్రాసెసింగ్‌ ఫీజు పేమెంట్‌ పత్రం, హాల్‌ టికెట్, ర్యాంకు కార్డు, ఎస్‌ఎస్‌సీ లేకుంటే దానికి సమానమైన విద్యార్హతలున్న ఒరిజినల్, ఇంటర్నెట్‌ మార్కుల జాబితా.  4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ, పదోతరగతి ప్రైవేటుగా చదివితే నివాస ధ్రువపత్రం, 2024-25కు సంబంధించి ఓసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్‌ ధ్రువపత్రం, 2021 జనవరి 1 తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువపత్రం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం. ఒరిజినల్స్‌తోపాటు రెండు సెట్ల నకలు కాపీలు తీసుకువెళ్లాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు