logo

ఇటీవల నిశ్చితార్థం.. ఇంతలోనే ప్రమాదం

తీరప్రాంత గ్రామం సావిత్రినగర్‌ మార్గంలో యానాం ఒబిలిస్క్‌ టవర్‌ వద్ద మంగళవారం తెల్లవారుజామున బైకుపై వేగంగా వెళుతున్న యువకుడు కర్రి నూకరాజు(21) గేదెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ మృతిచెందాడు.

Published : 29 May 2024 03:18 IST

ద్విచక్రవాహనంతో గేదెను ఢీకొట్టి యువకుడి మృత్యువాత

కర్రి నూకరాజు (పాత చిత్రం)

యానాం, న్యూస్‌టుడే: తీరప్రాంత గ్రామం సావిత్రినగర్‌ మార్గంలో యానాం ఒబిలిస్క్‌ టవర్‌ వద్ద మంగళవారం తెల్లవారుజామున బైకుపై వేగంగా వెళుతున్న యువకుడు కర్రి నూకరాజు(21) గేదెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ మృతిచెందాడు. యానాం ట్రాఫిక్‌ పోలీసుల వివరాల ప్రకారం.. సావిత్రినగర్‌ కొత్తకాలనీకి చెందిన కర్రి నూకరాజుకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఇంట్లో ఆఖరివాడైన నూకరాజు తండ్రి బూసిరాజుకు ఆరో సంతానం. వానపల్లి గ్రామంలోని పల్లాలమ్మ గుడికి వెళ్లడానికి కుటుంబ సభ్యులంతా ఆటోలో తెల్లవారుజామున సిద్ధమయ్యారు. గిరియాంపేట ఇంజినీరింగ్‌ కళాశాల వద్దనున్న బంకులో పెట్రోలు కొట్టించుకునివస్తానని మూడు గంటల సమయంలో నూకరాజు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. అక్కడ్నుంచి తిరిగి వస్తుండగా రోడ్డుపై గేదె అడ్డురావడంతో దానిని ఢీకొట్టాడు. దాంతో అది అక్కడికక్కడే చనిపోయింది. నూకరాజు తీవ్రంగా గాయపడ్డాడు. గుడికి వెళ్లడంకోసం ఆటోలో బయల్దేరిన బూసిరాజు కుటుంబం రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న తమ కుమారుడిని చూసి యానాం ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా వైద్యులు వెంటనే కాకినాడకు తరలించారు. చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఘటనపై ట్రాఫిక్‌ ఎస్సై ప్రభాకరరావు ఆధ్వర్యంలో హెడ్‌కానిస్టేబుల్‌ రత్నకుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు