logo

Indian Railways: రైలు ప్రయాణమా.. 139 గుర్తుంచుకోండి

రైలు ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే.. మీరు ప్రయాణిస్తున్న బోగీలో సమస్యలు ఉంటే.. రైలులోగాని, స్టేషన్‌లో గానీ మీ లగేజీని మర్చిపోతే.. మీ విలువైన వస్తువులేమైనా చోరీకి గురైతే.. ఇలాంటి సమస్యలపై ఫిర్యాదుకు రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన టోల్‌ఫ్రీ నంబరే 139.

Published : 29 May 2024 05:32 IST

రైలు ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే.. మీరు ప్రయాణిస్తున్న బోగీలో సమస్యలు ఉంటే.. రైలులోగాని, స్టేషన్‌లో గానీ మీ లగేజీని మర్చిపోతే.. మీ విలువైన వస్తువులేమైనా చోరీకి గురైతే.. ఇలాంటి సమస్యలపై ఫిర్యాదుకు రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన టోల్‌ఫ్రీ నంబరే 139.

 న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం)

ఫోన్‌ చేస్తే ఏమవుతుంది..

ఏ రైలు నుంచి టోల్‌ఫ్రీ నంబరుకు కాల్‌ చేస్తామో ఆ రైలు ప్రయాణించే మార్గంలోని రైల్వే డివిజన్‌ కార్యాలయానికి ఈ కాల్‌ వెళ్తుంది. అక్కడ 24 గంటలు అప్రమత్తంగా ఉండే సిబ్బంది ఆ వివరాలు తెలుసుకుంటారు. రైలు ఆ తర్వాత చేరే స్టేషన్‌కు సమాచారం అందిస్తారు. దీనిపై ఆయా రైల్వేస్టేషన్లలోని అధికారులు, సిబ్బంది వెంటనే స్పందిస్తారు. ఫోన్‌ కాల్‌లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా అక్కడకు చేరుకుని సంబంధిత బోగీలోకి వెళ్లి సమస్య పరిష్కరిస్తారు.

దేనిపై ఫిర్యాదు చేయవచ్చంటే...

  • ప్రయాణ సమయంలో రైలులోగాని, రైల్వేస్టేషన్‌లోగాని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయవచ్చు.
  • రైలు బోగీలో మీతోపాటు ప్రయాణిస్తున్న వారిలో ఎవరికైనా ఆకస్మాతుగా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు, వైద్య సహాయం అవసరమైనప్పుడు ఈ నంబరుకు సమాచారం అందించొచ్చు.  
  • బోగీలోని మరుగుదొడ్లలో నీరు సరఫరా కాకపోయినా, ఫ్యాన్లు, దీపాలు పనిచేయకపోయినా,  ఎవరైనా వ్యక్తి లేదా వ్యక్తుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించినప్పుడు ఫిర్యాదు చేయవచ్చు.
  • ప్రయాణికులు తమ బ్యాగును రైలులో మర్చిపోయినప్పుడు. ఏదైనా రైల్వేస్టేషన్‌లో రైలు ఆగినప్పుడు తాగునీటి కోసమో ఇతర పదార్థాలు తీసుకునేందుకు స్టాల్‌కు వెళ్లేందుకు కిందకు దిగినప్పుడు రైలు కదిలిపోయి అందులో మీ లగేజీ ఉండిపోయినప్పుడు టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించవచ్చు.
  • బోగీలో మీ సెల్‌ఫోన్లు, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురైనప్పుడు.. మీరు రిజర్వేషన్‌ చేయించుకున్న సీటు, బెర్త్‌లో వేరొకరు కూర్చొని లేవనప్పుడు.. ఎంతచెప్పినా మీ మాట విన్పించుకోనప్పుడు, బోగీలో మద్యం తాగుతూ, పేకాట ఆడుతూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపైనా ఫిర్యాదు చేయవచ్చు.
  • బోగీలో ఆకతాయిలు, హిజ్రాలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తున్నా, టీటీఈ పేరుతో నకిలీ వ్యక్తి తిరుగుతున్నా టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయవచ్చు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని