logo

కలలు చెదిరి.. కన్నీట మునిగి

మండలంలోని యర్నగూడెం గ్రామ యువకుడు కోట సువర్ణరాజు(14) రోడ్డు ప్రమాదానికి గురై.. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ప్రాణాలు వదిలాడు.

Published : 05 Dec 2022 06:16 IST

సువర్ణరాజు (పాతచిత్రం)

దేవరపల్లి: మండలంలోని యర్నగూడెం గ్రామ యువకుడు కోట సువర్ణరాజు(14) రోడ్డు ప్రమాదానికి గురై.. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ప్రాణాలు వదిలాడు. సువర్ణరాజు.. కోట రాంబాబు-అమ్మాజీ దంపతుల కుమారుడు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేవాడు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంటి వద్దనే ఉన్నాడు. మధ్యాహ్నం మిత్రులు వచ్చి కొవ్వూరులో క్యాటరింగ్‌ పని ఉందని తీసుకెళ్లారు. ఈ క్రమంలో యర్నగూడేనికి చెందిన స్వామి, దేవరపల్లికి చెందిన యశ్వంత్‌తో కలిసి.. సువర్ణరాజు కొవ్వూరు బయలుదేరాడు. దొమ్మేరు వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి పడటంతో సువర్ణరాజు తలకు తీవ్రగాయమైంది. తొలుత కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి.. ఆపై రాజమహేంద్రవరంలో పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. కానీ.. పరిస్థితి విషమించగా కాకినాడ జీజీహెచ్‌ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. శవపరీక్ష చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసి.. వారు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని