logo

పాలంగి దుకాణంలో భారీ చోరీ

ఉండ్రాజవరం మండలం పాలంగిలో సిమెంటు, ఇనుము దుకాణంలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. రూ.38 లక్షల నగదు, 12 కాసుల బంగారం, కిలో వెండి పోయినట్లు బాధితులు పేర్కొంటున్నారు.

Published : 05 Dec 2022 06:20 IST

వివరాలు సేకరిస్తున్న అదనపు ఎస్పీ, డీఎస్పీ

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: ఉండ్రాజవరం మండలం పాలంగిలో సిమెంటు, ఇనుము దుకాణంలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. రూ.38 లక్షల నగదు, 12 కాసుల బంగారం, కిలో వెండి పోయినట్లు బాధితులు పేర్కొంటున్నారు. అదనపు ఎస్పీ జి.వెంకటేశ్వరరావు, డీఎస్పీ వి.ఎస్‌.ఎన్‌ వర్మ, ఎస్సై పేరూరి నాగరాజు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ముళ్లపూడి దుర్గానాథ్‌, సింహాద్రి వెంకటేశ్వరరావు ఉమ్మడిగా సిమెంటు, ఇనుము దుకాణం నిర్వహిస్తున్నారు. వేరే చోట స్థలం కొనుగోలు చేసేందుకు కొంత మొత్తాన్ని దుకాణంలో ఉంచారు. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బల్ల మీదుగా షట్టర్‌పై ఉన్న ఖాళీప్రదేశం గుండా లోపలకు ప్రవేశించారు. ఇనుప కమ్మీతో బీరువా తాళం పగులగొట్టి నగదు, బంగారు, వెండితో ఉడాయించారు. బీరువా వద్ద ఉన్న సీసీ కెమెరా తీగను తొలగించాడు. వేరే ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ద్వారా దొంగ చాలా సమయం ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. బయటకు రాగానే వేరే వ్యక్తి బండితో సిద్ధంగా ఉండగా ఇద్దరూ వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని