logo

డొక్కు బస్సే.. నాన్‌స్టాప్‌ సర్వీసట!

కండిషన్‌లో ఉన్న ఎక్స్‌ప్రెస్‌ బస్సులను విజయవాడలో జరిగే వైకాపా జయహో బీసీ మహాసభకు తరలించేసిన ఆర్టీసీ అధికారులు డొక్కు బస్సులను ప్రయాణికులకు సర్దుబాటు చేసి బుధవారం నాన్‌స్టాప్‌ సర్వీసులుగా నడిపేశారు.

Published : 08 Dec 2022 03:58 IST

నాన్‌స్టాప్‌ సర్వీసుగా పల్లెవెలుగు బస్సు  

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): కండిషన్‌లో ఉన్న ఎక్స్‌ప్రెస్‌ బస్సులను విజయవాడలో జరిగే వైకాపా జయహో బీసీ మహాసభకు తరలించేసిన ఆర్టీసీ అధికారులు డొక్కు బస్సులను ప్రయాణికులకు సర్దుబాటు చేసి బుధవారం నాన్‌స్టాప్‌ సర్వీసులుగా నడిపేశారు. వాటిలో ఒక బస్సు యాంత్రిక సమస్య తలెత్తి కాంప్లెక్స్‌లోనే మొరాయించడంతో అప్పటికే గంట నుంచి బస్సు కోసం నిరీక్షించిన ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద బుధవారం చోటు చేసుకున్న సంఘటన ఇది. రాజమహేంద్రవరం-కాకినాడ నాన్‌స్టాప్‌ సర్వీసులుగా ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో పల్లెవెలుగు బస్సులను నడిపేశారు. ఉదయం 10.30 గంటల సమయంలో యాంత్రిక సమస్య తలెత్తి కాంప్లెక్స్‌లో ఓ బస్సు ఇలా ఆగిపోయింది. అరగంట తర్వాత కాకినాడ నుంచి వచ్చిన అల్ట్రాడీలక్స్‌ బస్సులో కొంతమంది ప్రయాణికులను పంపించారు. 11.25 గంటల సమయంలో పల్లెవెలుగు బస్సుకు మరమ్మతులు పూర్తిచేసి మిగతావారిని ఎక్కించారు.  

ఇంజిన్‌కు మరమ్మతులు చేస్తున్న గ్యారేజ్‌ సిబ్బంది

వేరే బస్సు నుంచి సెల్ఫ్‌ స్టార్ట్‌ చేస్తూ...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని