logo

పాఠశాలల్లో రాగిజావ పంపిణీ నేటి నుంచి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జగనన్న గోరుముద్దలో భాగంగా వారంలో మూడు రోజుల్లో ఉదయం రాగిజావ పంపిణీ చేయాలని నిర్ణయించారు.

Published : 21 Mar 2023 05:37 IST

రాగిపిండి, బెల్లం ప్యాకెట్లు

వెంకట్‌నగర్‌(కాకినాడ): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జగనన్న గోరుముద్దలో భాగంగా వారంలో మూడు రోజుల్లో ఉదయం రాగిజావ పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో వాకలపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం దీన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో 1,259 పాఠశాలల్లో 1,63,309 మంది విద్యార్థులు చదువుతున్నారు. దీనికి సంబంధించి 18 టన్నుల రాగిపిండి, 18 టన్నుల బెల్లం జిల్లాకు చేరాయి. సగటున ఒక్కో విద్యార్థికి 150 ఎం.ఎల్‌ చొప్పున జావ పంపిణీ చేయనున్నారు. దీన్ని ఎలా పంపిణీ చేయాలి? సకాలంలో తయారు చేయడానికి వంట మనుషులను ఎలా సిద్ధం చేసుకోవాలి తదితర అంశాలపై  స్పష్టత లేకపోవడంతో ప్రధానోపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలో 538 పాఠశాలలకు ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజన పథకం అమలవుతుండగా, 721 పాఠశాలల్లో భోజనం వండి వడ్డిస్తున్నారు. ఏజెన్సీల ద్వారా అమలవుతున్న పాఠశాలలకు ఉదయం 11 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఉదయం 8.45కే రాగిజావ అందించాలని ప్రభుత్వం సూచించింది. ఏజెన్సీల ద్వారా  పాఠశాలలకు సకాలంలో అందించే అంశం సాధ్యాసాధ్యాలపై  మల్లగుల్లాలు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని