logo

తుపాను నష్ట నివారణకు ముందస్తు చర్యలు

తుపాను నష్ట నివారణకు జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర అధికారులతో సంయుక్తంగా ముందస్తు చర్యలు చేపట్టిందని ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ తెలిపారు.

Published : 06 Dec 2023 04:18 IST

బీచ్‌రోడ్డులో అధికారులతో మాట్లాడుతున్న ఎస్పీ సతీష్‌కుమార్‌

మసీదుసెంటర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: తుపాను నష్ట నివారణకు జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర అధికారులతో సంయుక్తంగా ముందస్తు చర్యలు చేపట్టిందని ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాంగాన్ని సర్వసన్నద్ధంగా ఉంచామన్నారు. ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ రూరల్‌ మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల వద్ద ముందస్తు జాగ్రత్తలు, పోలీసు బందోబస్తును ఎస్పీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ చేపలవేటకు వెళ్లవద్దని సూచించారు. ప్రజలకు ఎలాంటి సాయం కావాలన్నా పోలీసు, ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయాలన్నారు. పర్యటనలో డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్‌, కాకినాడ రూరల్‌ సీఐ కె.శ్రీనివాస్‌, ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని