logo

శిశుగృహ ప్రహరీ కూలి పిల్లల ఆందోళన

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, దానవాయిపేట: రాజమహేంద్రవరం మహిళా కళాశాల ఎదురుగా బాల సదనానికి చెందిన గోడ మంగళవారం రాత్రి భారీ వర్షానికి నాని కూలిపోయింది.

Published : 06 Dec 2023 04:29 IST

శిశుగృహలో పిల్లలతో అగ్నిమాపక సిబ్బంది

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, దానవాయిపేట: రాజమహేంద్రవరం మహిళా కళాశాల ఎదురుగా బాల సదనానికి చెందిన గోడ మంగళవారం రాత్రి భారీ వర్షానికి నాని కూలిపోయింది. దీంతో పక్కనే ఉన్న ప్రధాన కాలువలో వర్షపు నీరు లోపలకు చేరిపోవడంతో భవనం కింది భాగం నీట మునిగింది. ఈ భవనంలో 15 మంది పిల్లలు ఉన్నారు. వెంటనే సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వారు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. వారిని పై భాగంలో షెడ్డు ఉంటే అక్కడకు చేర్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకొన్నారు.

ముంపు నీటిలో చిక్కుకున్న కారు, బస్సు: తుపాను ప్రభావంతో నగరంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి హైటెక్‌ బస్టాండ్‌ వద్దకు భారీగా వర్షపు నీరు చేరింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కారు, ఆర్టీసీ బస్సు ముంపులో చిక్కుకుపోయాయి. మున్సిపల్‌ సిబ్బంది, అగ్నిమాపక యంత్రాంగం అక్కడకు చేరుకుని తాళ్ల సాయంతో కారును బయటకు తెచ్చారు. బస్సులో ఉన్న వారిని సురక్షితంగా తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని