logo

అన్నదాతలను ఆదుకుంటాం

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరపాలని కలెక్టర్‌ మాధవీలత రైతులకు సూచించారు.

Published : 06 Dec 2023 04:48 IST

మురమండలో కలెక్టర్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

కడియం, కొవ్వూరు పట్టణం: తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరపాలని కలెక్టర్‌ మాధవీలత రైతులకు సూచించారు. కడియం మండలం మురమండలో తడిసిన ధాన్యం రాశులను ఆర్డీవో చైౖత్రవర్షిణి, తహసీల్దారు ఎం.సుజాతతో కలిసి పరిశీలించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ప్రతి మండలానికి కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ధాన్యం ఏ స్థితిలో ఉన్నా సేకరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని వివరించారు. అనంతరం కొవ్వూరు మండలంలో పర్యటించి కోత కోయని పొలాలు, ఒబ్బిడి చేసిన ధాన్యం చూశారు. రైతులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో చర్చించారు. కోతలు కోసిన పంటలను మిల్లులకు తక్షణం తరలిస్తున్నామన్నారు. ఇన్‌ఛార్జి ఆర్డీవో కృష్ణనాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మాధవరావు, జిల్లా ఉద్యాన అధికారి అరుణకుమారి, తహసీల్దారు నాగరాజు నాయక్‌, ఏఓ గంగాధర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని