logo

ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు

ధవళేశ్వరం కొత్తవీధికి చెందిన అంబటి కీర్తినాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్లలో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నారు.

Updated : 07 Dec 2023 08:16 IST

అంబటి కీర్తినాయుడు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ధవళేశ్వరం కొత్తవీధికి చెందిన అంబటి కీర్తినాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్లలో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నారు. తాజాగా సెంట్రల్‌ బోర్డుఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సస్‌లో జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా కొలువు వచ్చినట్లు బుధవారం ఆమె తండ్రి అడ్వకేట్‌ అంబటి మురళీకృష్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)లో 2019లో ఆదాయపు పన్ను శాఖలో ఉన్నతాధికారి ఉద్యోగం సాధించిన ఆమె అనంతరం కస్టమ్స్‌ విభాగంలో ట్యాక్స్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. గతేడాది మార్చిలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఇంటర్‌బేస్డ్‌ ఉద్యోగాల్లో భాగంగా ఎంటీఎస్‌ ఉద్యోగం, భారత రైల్వేలో ఉన్నతాధికారిగా, పోస్టల్‌ విజిలెన్సు విభాగంలో మరో ఉద్యోగం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామ కార్యదర్శి పోస్టుకు సైతం ఎంపికయ్యారు. 2019లో డిగ్రీ పూర్తయిన వెంటనే ఆరు కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ కొలువులు వచ్చినా ఎప్పటికైనా సివిల్స్‌ సాధించి దేశసేవ చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని ఆమె చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని