logo

పంట నష్టంపై సమగ్ర సర్వే

తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వాటిల్లిన పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి బాధిత రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎన్‌.విజయ్‌కుమార్‌ చెప్పారు.

Published : 07 Dec 2023 05:29 IST

రైతులతో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ జిల్లా అధికారి విజయ్‌కుమార్‌

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వాటిల్లిన పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి బాధిత రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎన్‌.విజయ్‌కుమార్‌ చెప్పారు. వర్షాలతో ముంపునకు గురైన పంటలను అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. గొల్లప్రోలు, చేబ్రోలు, చెందుర్తి గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. కౌలు రైతులే అధికంగా పంటలు నష్టపోయారని, వీరికి సీసీఆర్‌ కార్డులు లేవని రైతులు సమస్యను వివరించారు.  ఈక్రాప్‌ ఎవరి పేరున నమోదయిందో వారికే పరిహారం అందే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ ఏడీ పి.స్వాతి, మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని