logo

లక్ష్యం నీరు గారుతోంది..!

గాంధీనగర్‌ బాలభవన్‌ వద్ద రూ.50 లక్షల స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మించిన షటిల్‌ ఇండోర్‌ స్టేడియంలోకి వర్షపు నీరు చేరుతోంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు స్టేడియంలోని షటిల్‌ సింథటిక్‌ కోర్టుల్లోకి నీరు చేరి, క్రీడాకారులు అవస్థలు పడుతున్నారు.

Updated : 07 Dec 2023 05:50 IST

స్టేడియంలోని షటిల్‌ కోర్టు తడిసి ఇలా.., కోర్టులో చేరిన నీరు

గాంధీనగర్‌ బాలభవన్‌ వద్ద రూ.50 లక్షల స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మించిన షటిల్‌ ఇండోర్‌ స్టేడియంలోకి వర్షపు నీరు చేరుతోంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు స్టేడియంలోని షటిల్‌ సింథటిక్‌ కోర్టుల్లోకి నీరు చేరి, క్రీడాకారులు అవస్థలు పడుతున్నారు. బుధవారం ఇద్దరు క్రీడాకారులు వర్షపు నీరు కారణంగా జారిపడిపోయారు. 2021, జనవరిలో అప్పటి పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ఈ స్టేడియాన్ని ప్రారంభించారు. ఇందులో నాలుగు కోర్టులున్నాయి. రోజూ ఉదయం 64 మంది క్రీడాకారులు ఇక్కడ సాధన చేస్తుంటారు. సాయంత్రం చిన్నారులు, విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. దీని నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. క్రీడాకారుల నుంచి నెలవారీ ఫీజులు వసూలు చేస్తున్నారు. నగర పాలక సంస్థకు నామమాత్రపు అద్దెలు చెల్లిస్తారు. ఈ స్టేడియం పైభాగంలో వేసిన షీట్‌కు రంధ్రాలు పడ్డాయి. వీటిని బాగుచేయాలని ఏడాది కిందట స్మార్ట్‌సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో తాత్కాలిక చర్యలు చేపట్టినా, మళ్లీ స్టేడియం పై భాగం నుంచి కిందకు నీరు కారిపోతోంది.  ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ స్టేడియం అనతి కాలంలోనే మరమ్మతులకు గురికావడం నాణ్యతను ప్రశ్నిస్తోంది. ఈ విషయాన్ని కోచ్‌ ప్రవీణ్‌ వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా రెండు,మూడు రోజులు వర్షాలు పడితే పైకప్పు నుంచి కిందకు నీరు చేరి ఇబ్బందిగా ఉంటుందన్నారు. గతంలో మరమ్మతులు చేసినా నీరు చేరుతుందని పేర్కొన్నారు.

న్యూస్‌టుడే, బాలాజీచెరువు(కాకినాడ)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని