logo

రాజకీయ పార్టీలు చురుకైన పాత్ర పోషించాలి

జిల్లాలో 18-19 ఏళ్ల యువతను కొత్త ఓటర్లుగా నమోదు చేయించే విషయంలో రాజకీయ పార్టీలు చురుకైన పాత్ర పోషించాలని కలెక్టర్‌ మాధవీలత, జేసీ తేజ్‌భరత్‌, డీఆర్వో నరసింహులు సూచించారు.

Published : 07 Dec 2023 05:33 IST

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): జిల్లాలో 18-19 ఏళ్ల యువతను కొత్త ఓటర్లుగా నమోదు చేయించే విషయంలో రాజకీయ పార్టీలు చురుకైన పాత్ర పోషించాలని కలెక్టర్‌ మాధవీలత, జేసీ తేజ్‌భరత్‌, డీఆర్వో నరసింహులు సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితా పరిశీలన, ఫారం-6, 7, 8 స్వీకరణ కోసం ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో మొత్తం 17,924 దరఖాస్తులు వచ్చాయన్నారు. 47 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో పదికి మించి ఓటర్లు ఉన్న 66 డోర్‌ నంబర్లలో 787 మంది ఉన్నారని, వాటిని పరిశీలన చేస్తున్నామన్నారు. ఈ నెల 8న ఎన్నికల ప్రత్యేక పరిశీలకులుగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎన్‌.యువరాజ్‌ జిల్లాకు రానున్నారని, ఆ రోజు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. పారదర్శకంగా తుది జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని