logo

‘నియంత పాలనకు స్వస్తి పలకాలి’

పల్లెలను నిలువు దోపిడీ చేస్తున్న నియంత పాలనకు స్వస్తి పలకాలని, వైకాపా ప్రభుత్వంలో సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మారారని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాలడుగుల లక్ష్మణరావు అన్నారు.

Published : 07 Dec 2023 05:35 IST

మాట్లాడుతున్న జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడు పాలడుగుల లక్ష్మణరావు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: పల్లెలను నిలువు దోపిడీ చేస్తున్న నియంత పాలనకు స్వస్తి పలకాలని, వైకాపా ప్రభుత్వంలో సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మారారని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాలడుగుల లక్ష్మణరావు అన్నారు. కొవ్వూరు లిటరరీ క్లబ్‌లో సర్పంచుల సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైబీవీ రాజేంద్రప్రసాద్‌ ఆదేశాల మేరకు సర్పంచులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. సర్పంచుల హక్కులు, విధులు, బాధ్యతలను లాక్కుని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియంతగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన లక్ష్మణరావును జనసేన నాయకులు సత్కరించారు. సర్పంచులు ఉప్పులూరి రాజేంద్ర మునిప్రసాద్‌, మేకల శ్రీను, జెట్టి బంగారయ్య, ఎంపీటీసీ సభ్యులు యలమర్తి రాంబాబు, పసలపూడి తాతారావు, మాజీ జడ్పీటీసీ సభ్యరాలు గారపాటి శ్రీదేవి, తెదేపా కొవ్వూరు మండల అధ్యక్షుడు వట్టికూటి వెంకటేశ్వరరావు, తుంపల్లి ఆదినారాయణ, మద్దిపాటి సత్యనారాయణ, జనసేన నాయకులు మారిశెట్టి వెంకటేశ్వరరావు, కొప్పాక విజయ్‌కుమార్‌, ఉప్పులూరి చిరంజీవి, గంటా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని