logo

పొంగిన కొవ్వాడ కాలువ

తాళ్లపూడి మండలంలో మంగళవారం  సాయంత్రం ప్రశాంతంగా ఉన్న కొవ్వాడ కాలువ బుధవారం తెల్లవారే సరికి పొంగింది. మంగళవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురవడంతో కొండ, ఎగువ ప్రాంతాల నుంచి నీరు వచ్చి చేరింది.

Published : 07 Dec 2023 05:36 IST

పోచవరం నుంచి తాడిపూడి వెళ్లే రహదారిలో నడుము లోతు  నీటిలో ధాన్యాన్ని తీస్తున్న కూలీలు

తాళ్లపూడి, న్యూస్‌టుడే: తాళ్లపూడి మండలంలో మంగళవారం  సాయంత్రం ప్రశాంతంగా ఉన్న కొవ్వాడ కాలువ బుధవారం తెల్లవారే సరికి పొంగింది. మంగళవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురవడంతో కొండ, ఎగువ ప్రాంతాల నుంచి నీరు వచ్చి చేరింది. దీంతో సమీపంలోని రహదార్లపై ఉంచిన ధాన్యం రాశులు నీట మునిగాయి. తాడిపూడి నుంచి పోచవరం వెళ్లే రహదారిలో ఉన్న ధాన్యం రాశులు నడుం లోతులో నీట మునగడంతో కూలీలు సాయంతో ట్రాక్టర్లపై బయటకు తరలించారు. వరదనీటి ప్రవాహానికి ధాన్యం కొట్టుకుపోయింది. కాలువ పక్కన సాగు చేసిన పొగాకు, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. కాలువలో ప్రవాహ ఉద్ధృతికి పలు మార్గాలకు అంతరాయం ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు