logo

జలంలో జగనన్న కాలనీలు

చిన్నపాటి వర్షానికే జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ చూపకపోవడం, పంట, మురుగు కాలువల్లో నీరు సాగక కాలనీలు దుర్భరంగా ఉన్నాయి.

Published : 08 Dec 2023 03:21 IST

 కొవ్వూరు: పశివేదల రోడ్డులోని జగనన్న కాలనీకి వెళ్లే మార్గం

న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం, నిడదవోలు, నల్లజర్ల: చిన్నపాటి వర్షానికే జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ చూపకపోవడం, పంట, మురుగు కాలువల్లో నీరు సాగక కాలనీలు దుర్భరంగా ఉన్నాయి. నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలో పలుచోట్ల ముంపుబారిన పడ్డాయి. కొవ్వూరు మండలం పశివేదల రోడ్డు పక్కన ఉన్న జగనన్న కాలనీ జలమయమైంది. కాలనీ వాసులు బయటకు రాలేక, మంచినీరు, నిత్యావసరాలు, ఇతర అవసరాలకు అవస్థలు పడుతున్నారు.

  • నిడదవోలు పట్టణంలోని జగనన్న కాలనీకి సరైన మార్గం లేదు. రోడ్డు బురదమయంగా మారడంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.
  • నల్లజర్ల మండలంలోని తూర్పు చోడవరంలో 100 మంది లబ్ధిదారులకు అయిదు లేఔట్లు ఏర్పాటు చేశారు. పల్లపు ప్రాంతంలో ఉండటంతో ఆ కాలనీలు నీట మునుగుతున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని