logo

దెబ్బతిన్న విద్యుత్తు ఉపకేంద్రాల పునరుద్ధరణ

మిగ్‌జాం తుపాను కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్తు ఉప కేంద్రాలు, ఇతర పరికరాలను పునరుద్ధరించినట్లు ఈపీడీసీఎల్‌ రాజమహేంద్రవరం సర్కిల్‌ ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్‌ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 08 Dec 2023 03:28 IST

దేవీచౌక్‌(రాజమహేంద్రవరం): మిగ్‌జాం తుపాను కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్తు ఉప కేంద్రాలు, ఇతర పరికరాలను పునరుద్ధరించినట్లు ఈపీడీసీఎల్‌ రాజమహేంద్రవరం సర్కిల్‌ ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్‌ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. తుపాను కారణంగా జిల్లాలో 132/33కేవీ విద్యుత్తు ఉపకేంద్రం-1, 33/11కేవీ ఉపకేంద్రాలు-102, 33కేవీ ఫీడర్లు-85, 11 కేవీ ఫీడర్లు-537, 33 కేవీ విద్యుత్తు స్తంభాలు-18, 11 కేవీ విద్యుత్తు స్తంభాలు-254, ఎల్‌టీ విద్యుత్తు స్తంభాలు-301, ట్రాన్స్‌ఫార్మర్లు-178 దెబ్బతిన్నాయన్నారు. వీటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించామన్నారు. ఇంకా ఎక్కడైనా సమస్యలుంటే టోల్‌ ఫ్రీ నెంబరు 1912 లేదా సర్కిల్‌ కార్యాలయంలోని ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ నెంబరు-73822 99960లో సంప్రదిస్తే సత్వరం పరిష్కరిస్తామన్నారు.      36 మండలాల్లోని 752 గ్రామాల్లో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని