logo

వేటకు వెళ్లి తిరిగిరాని మత్స్యకారులు

వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడాలని బాధిత కుటుంబాలు గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కృతికాశుక్లాకు మొరపెట్టుకున్నాయి. మత్స్యకార నాయకుడు, తెదేపా నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేశ్‌ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశాయి.

Published : 08 Dec 2023 03:34 IST

కాపాడాలని కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు వినతి

కాకినాడ కలెక్టరేట్‌: వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడాలని బాధిత కుటుంబాలు గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కృతికాశుక్లాకు మొరపెట్టుకున్నాయి. మత్స్యకార నాయకుడు, తెదేపా నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేశ్‌ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశాయి. కాకినాడ పర్లోపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు వారంరోజుల క్రితం కాట్రేనికోన మండలం కొత్తపాలెం లైట్‌ నుంచి సముద్రంలో వేటకు వెళ్లారని, ప్రస్తుతం వారి ఆచూకీ లభించడంలేదని తెలిపారు. వీరిని రక్షించి తీరానికి తీసుకురావాలని మత్స్యశాఖ అధికారులను వేడుకున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా వద్ద నిధుల్లేవని చెబుతున్నారని, మీరైనా కాపాడాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఒమ్మి బాలాజీ, తుమ్మల సునీత, తెదేపా నాయకుడు కసింకోట చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని