logo

నేడు గ్రూపు-2 ప్రిలిమినరీ

ఏపీపీఎస్సీ ద్వారా ఆదివారం జిల్లాలో గ్రూపు-2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 52 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

Published : 25 Feb 2024 06:19 IST

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే:  ఏపీపీఎస్సీ ద్వారా ఆదివారం జిల్లాలో గ్రూపు-2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 52 కేంద్రాలను ఏర్పాటు చేశారు.  పరీక్షకు 24,489 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. నిర్వహణకు జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు డీఆర్వో డి.తిప్పేనాయక్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల్లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సెల్‌ఫోన్లు అనుమతించరని, ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకువెళ్లవద్దని సూచించారు. అన్ని కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని, వీటిలో అన్ని సదుపాయాలు కల్పించనున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని