logo

వర్కు ఫ్రం హోం పేరుతో మరో మోసం

ఇంటి వద్దనే ఉంటూ నగదు సంపాదించవచ్చునని నమ్మించి ఓ మహిళ ఖాతా నుంచి రూ.3.97 లక్షలు ఆన్‌లైన్‌లో దోచుకున్న ఘటనపై రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 25 Feb 2024 06:20 IST

రాజమహేంద్రవరం నేరవార్తలు: ఇంటి వద్దనే ఉంటూ నగదు సంపాదించవచ్చునని నమ్మించి ఓ మహిళ ఖాతా నుంచి రూ.3.97 లక్షలు ఆన్‌లైన్‌లో దోచుకున్న ఘటనపై రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ వీరయ్యగౌడ్‌ వివరాల మేరకు.. కోటిలింగాలపేటకు చెందిన అపర్ణ ఈ నెల 11న ఇస్టాగ్రామ్‌లో ఓ రీల్‌ చూశారు. ఇంటి వద్దనే ఉండి పనిచేస్తూ నగదు సంపాదించవచ్చుననేది దాని సారాంశం. అందులో ఫోన్‌ నంబరును సంప్రదించారు. వారి సూచనలతో టెలిగ్రామ్‌లో ద్వారా నగదు చెల్లించి వస్తున్న టాస్కులను పూర్తి చేయడం మొదలుపెట్టారు. తొలి విడతగా రూ.వెయ్యి చెల్లిస్తే టాస్కు పూర్తి అనంతరం రూ.1,300 వచ్చింది. అలా నాలుగు సార్లు వచ్చే సరికి నమ్మకం రావడంతో రూ.వేలల్లో నగదు అపర్ణ చెల్లించారు. అలా ఈ నెల 13 నాటికి రూ.3.97 లక్షలు చెల్లించారు. ఆ మొత్తం పొందాలంటే తిరిగి మరో రూ.3 లక్షలు చెల్లించాలని సందేశాలు రావడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌ సెల్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని