logo

ఆగిన 108.. ఆదుకున్న ‘కవచం’!

పాముకాటుకు గురైన యువకుడ్ని అత్యవసర చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించే సమయంలో మరమ్మతులతో 108 వాహనం నిలిచింది.

Published : 25 Feb 2024 06:21 IST

సీతానగరం: పాముకాటుకు గురైన యువకుడ్ని అత్యవసర చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించే సమయంలో మరమ్మతులతో 108 వాహనం నిలిచింది. దీంతో కుటుంబసభ్యులు, పీహెచ్‌సీ వైద్యసిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సీతానగరానికి చెందిన తవిటిక ప్రసన్నకుమార్‌(25)ను చేలో ఉండగా శనివారం పాముకాటుకు గురయ్యాడు. బాధితుడ్ని ద్విచక్రవాహనంపై స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అత్యవసర వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి 108లో బయలుదేరుతుండగా పీహెచ్‌సీ ప్రాంగణంలోనే 108 నిలిచిపోయింది. ఎంతసేపు ప్రయత్నించినా సెల్ఫ్‌ కావడం లేదు. స్థానికులంతా కలిసి వాహనాన్ని నెట్టే ప్రయత్నం చేసినా ఫలించలేదు. శ్రీరామనగరం సద్గురు చిట్టిబాబాజీ సంస్థానం నిర్వహిస్తున్న ఉచిత అంబులెన్సు ‘కవచం’ పీహెచ్‌సీ సిబ్బంది ఫోన్‌ చేసి అందులో బాధితుడ్ని ఎక్కించారు. సకాలంలో ఉచిత అంబులెన్సు రావడంతో ప్రభుత్వాసుపత్రికి చేరగలిగామని బాధితుడి సోదరుడు రాజు తెలిపారు. తరచుగా 108 అంబులెన్సు నిలిచిపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని పలువురు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని