logo

అందుబాటులోకి ఈఎస్‌ఐ ఆసుపత్రి

కాకినాడ జిల్లాలోని కార్మిక కుటుంబాలకు వంద పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వం ఆదివారం నుంచి అందుబాటులోకి తేనుంది.

Published : 25 Feb 2024 06:23 IST

నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని

ఆసుపత్రి భవనం

కాకినాడ కలెక్టరేట్‌:  కాకినాడ జిల్లాలోని కార్మిక కుటుంబాలకు వంద పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వం ఆదివారం నుంచి అందుబాటులోకి తేనుంది. సాంబమూర్తినగర్‌లో 7.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.114 కోట్ల వ్యయంతో కేంద్రం  ఈ ఆసుపత్రిని నిర్మించింది. 400 మంది వైద్య సిబ్బందితో సేవలు అందించనున్నారు. జిల్లాలోని 65వేల మంది కార్మికులు, సుమారు 2లక్షల మంది వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించనున్నారు. 2020లో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసి 2021 మార్చిలో పనులు ప్రారంభించారు. గత నెలలో పూర్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని