logo

ధర పతనం.. అరటి రైతులకు శోకం

అరటి ధర పతనమవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు మండలాల పరిధిలో సుమారు 3 వేల ఎకరాల్లో కర్పూర రకంతో పాటు చక్రకేళి, బొంత, అమృతపాణి తదితర రకాల అరటి సాగు చేస్తున్నారు.

Published : 25 Feb 2024 06:26 IST

గుట్టగా పడేసిన అరటి గెలలు

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: అరటి ధర పతనమవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు మండలాల పరిధిలో సుమారు 3 వేల ఎకరాల్లో కర్పూర రకంతో పాటు చక్రకేళి, బొంత, అమృతపాణి తదితర రకాల అరటి సాగు చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని లంకభూముల్లో సారవంతమైన నేల ఉండటంతో అక్కడ కూడా విరివిగా అరటి సాగు చేపట్టారు.

పెట్టుబడి రాని పరిస్థితి..

ఎకరానికి సుమారు 750 విత్తనం పిలకలు నాటగా పది నెలలకు పంట వస్తుంది. ఎకరానికి రూ.90 వేలు పెట్టుబడి అవుతుంది. వెదురు ఏర్పాటుకు చెట్టుకు రూ.120 ఖర్చవుతుంది. గత అయిదు నెలలుగా అరటి ధర బాగా తగ్గి కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో గెలలు తోటలోనే వృథాగా ముగ్గిపోతున్నాయి. రోడ్ల పక్కన గుట్టలుగా పడేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒడిశా, బిహార్‌ తదితర రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతులు చేస్తుంటారు. ధర పతనంతో ఎగుమతులు కూడా అరకొరగా సాగుతున్నాయి.


తోటలోనే ముగ్గిపోతున్నాయి

ప్రస్తుతం పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంది. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. గెలకు రూ.150 ధర పలికితే గిట్టుబాటు అవుతుంది. తోటలోనే గెలలు ముగ్గిపోతున్నాయి.

పిండి ఏసుబాబు, వెలగదుర్రు


వడ్డీలు పెరుగుతున్నాయి

కౌలు చెల్లించి, అప్పులు చేసి పెట్టుబడి పెట్టాము. ధర పతనం కావడంతో అప్పులు తీర్చలేని పరిస్థితి. ఏడాదిగా ధర ఇలా కిందిస్థాయిలో ఉంది. అధిక దిగుబడినిచ్చే గెలలు ఉత్పత్తి చేస్తున్నాం. అయినప్పటికీ ఆశించిన ధర రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం.

కోడూరి సత్యనారాయణ, తాడిపర్రు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని