logo

అన్నవరంలో 7,100 వ్రతాలు..!

అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు శనివారం పోటెత్తారు. మాఘ పౌర్ణమి సందర్భంగా తరలివచ్చారు. రద్దీ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే వ్రతాలు, సర్వ దర్శనాలు ప్రారంభించారు.

Published : 25 Feb 2024 06:35 IST

క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు శనివారం పోటెత్తారు. మాఘ పౌర్ణమి సందర్భంగా తరలివచ్చారు. రద్దీ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే వ్రతాలు, సర్వ దర్శనాలు ప్రారంభించారు. నిరంతరాయంగా పులిహోర, దద్దోజనం పంపిణీ చేశారు. ప్రసాదం కొరత లేకుండా అందించారు. రద్దీ తీవ్రంగా ఉండటంతో కాసేపు రూ. 300 ప్రదక్షిణ దర్శన టికెట్లు నిలుపుదల చేశారు. ట్రాఫిక్‌, భద్రతపై పర్యవేక్షించారు. వసతి గదులకు డిమాండ్‌ ఏర్పడింది. ఈవో కె. రామచంద్రమోహన్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఆదేశాలిచ్చారు. 7,100 వ్రతాలు జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రం మఖ పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున స్వామి, అమ్మవారు, పరమేశ్వరుడి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు