logo

కేసులు సత్వరం పరిష్కరించాలి

ప్యానల్‌, డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాదుల దృష్టికి వచ్చిన కేసులను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి, డీఎల్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి కె.ప్రత్యూషకుమారి సూచించారు.

Published : 29 Feb 2024 05:31 IST

దానవాయిపేట (రాజమహేంద్రవరం): ప్యానల్‌, డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాదుల దృష్టికి వచ్చిన కేసులను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి, డీఎల్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి కె.ప్రత్యూషకుమారి సూచించారు. బుధవారం జిల్లా న్యాయమూర్తి కార్యాలయంలో ఆయా న్యాయవాదులతో మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత న్యాయ సహాయం అందిస్తున్న కోర్టు కేసులు, బెయిల్‌ పిటిషన్లు, అప్పీళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

  • కారాగారంలోని ఖైదీలకు డీఎల్‌ఎస్‌ఏ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుతుందని ఆ సంస్థ జిల్లా కార్యదర్శి కె.ప్రత్యూషకుమారి పేర్కొన్నారు. బుధవారం మహిళా జైలును సందర్శించి ఖైదీలకు అందుతున్న సదుపాయాలు, సౌకర్యాలపై ఆరాతీశారు. ఎటువంటి సమస్య ఉన్న పారాలీగల్‌ వాలంటీర్ల ద్వారా డీఎల్‌ఎస్‌ఏ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆ కార్యక్రమంలో మహిళా జైలు సూపరింటెండెంట్‌ వసంతకుమారి పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని