logo

జెండా సభకు.. సందడిగా పయనం

తెలుగు జన విజయకేతనం ‘జెండా’ పేరిట తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నుంచి ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు.

Published : 29 Feb 2024 05:47 IST

మండపేటలో బస్సుకు జెండా ఊపుతున్న ఎమ్మెల్యే జోగేశ్వరరావు

అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : తెలుగు జన విజయకేతనం ‘జెండా’ పేరిట తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నుంచి ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఇప్పటికే నాలుగింట తెదేపా అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేయడంతో వారు భారీ సంఖ్యలో అనుచరులతో సభకు తరలి వెళ్లారు. మండపేట, అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం  నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఇన్‌ఛార్జులు అయితాబత్తుల ఆనందరావు, బండారు సత్యానందరావు, దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు తాడేపల్లిగూడెం సభకు తరలి వెళ్లారు. అమలాపురం నియోజకవర్గం నుంచి శెట్టబత్తుల రాజబాబు, డీఎంఆర్‌ శేఖర్‌ ఆధ్వర్యంలో జనసైనికులు భారీ సంఖ్యలో ర్యాలీగా తాడేపల్లిగూడెం వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా అన్ని  మండలాల నుంచి అధిక సంఖ్యలో తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు బస్సులు, ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు.

అమలాపురం గడియార స్తంభం నుంచి ర్యాలీగా జనసేన శ్రేణులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని