logo

30,714 మంది రైతులకు సున్నావడ్డీ రాయితీ

జిల్లాలోని 30,714 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.5,85,69,974 సున్నావడ్డీ రాయితీని ప్రభుత్వం జమ చేసినట్లు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు.

Published : 29 Feb 2024 05:55 IST

నమూనా చెక్కుతో అధికారులు, రైతులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: జిల్లాలోని 30,714 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.5,85,69,974 సున్నావడ్డీ రాయితీని ప్రభుత్వం జమ చేసినట్లు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. పీఎం కిసాన్‌- రైతుభరోసా పథకం, సున్నావడ్డీ పంట రుణాల పథకం కింద బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారుల ఖాతాలకు ఆర్థిక సహాయం జమచేయగా జిల్లాస్థాయి కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 2021-22 రబీ సీజన్‌లో 17,409 మంది తీసుకున్న పంట రుణాలకు సంబంధించి సున్నావడ్డీ రాయితీ రూ.3,40,08,955, 2022 ఖరీఫ్‌ సీజన్‌లో 13,305 మంది పొందిన పంట రుణాలకు రాయితీగా రూ.2,45,61,019 ప్రభుత్వం అందించినట్లు తెలిపారు. మూడో విడతగా పీఎం కిసాన్‌- వైఎస్సార్‌ రైతుభరోసా పథకం కింద 1,41,216 మందికి రూ.28.39 కోట్లను ప్రభుత్వం జమ చేసిందన్నారు. జేసీ తేజ్‌భరత్‌, జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని