logo

వెలుగులోకి నడిపించేది సైన్స్‌

మానవాళిని చీకటి నుంచి వెలుగులోకి నడిపించేది సైన్స్‌ అని వీసీ ఆచార్య కె.పద్మరాజు అన్నారు.

Published : 29 Feb 2024 06:00 IST

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వీసీ పద్మరాజు, శాస్త్రవేత్త కృష్ణమూర్తి తదితరులు

నన్నయ విశ్వవిద్యాలయం (రాజానగరం), న్యూస్‌టుడే: మానవాళిని చీకటి నుంచి వెలుగులోకి నడిపించేది సైన్స్‌ అని వీసీ ఆచార్య కె.పద్మరాజు అన్నారు. జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా నన్నయ విశ్వవిద్యాలయంలో బుధవారం ‘వికసిత్‌ భారత్‌ కోసం స్వదేశీ సాంకేతికత’ అనే థీమ్‌తో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సర్‌ సీవీ రామన్‌ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పీఎం-ఉషా పథకంలో మంజూరైన రూ.20 కోట్లతో నన్నయ విశ్వవిద్యాలయంలో సైన్స్‌ అభివృద్ధికి అడుగులు వేస్తున్నామని, నూతన కోర్సులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆచార్య జి.మురళీకృష్ణ, డా.కె.నూకరత్నాలు రచించిన పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ ఫర్‌ జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (జీఐఎస్‌) అనే పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు. విశిష్ట అతిథిగా హాజరైన శాస్త్రవేత్త డాక్టర్‌ వై.వి.ఎన్‌.కృష్ణమూర్తి మాట్లాడుతూ సముద్రాలలోని వాతావరణ పరిస్థితులను తెలియజేస్తూ శాస్త్ర సాంకేతిక రంగాలు అందిస్తున్న సేవలను వివరించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌ మాట్లాడుతూ నేటితరం శాస్త్రసాంకేతిక రంగాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేడు రేర్‌ డిసీజెస్‌డేను కూడా జరుపుకొంటారని గుర్తు చేశారు. వివిధ పోటీలలో విజేతలకు సర్టిఫికెట్లను, జ్ఞాపికలను అందజేశారు. నన్నయ విగ్రహానికి, సీవీ రామన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపల్‌ డా.బి.జగన్మోహన్‌ రెడ్డి, డీన్‌ ప్రొఫెసర్‌ వై.శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని