logo

వ్యర్థాలు వదిలేసి.. పనులు ముగించేసి..

కాటన్‌ బ్యారేజీ రహదారి మరమ్మతులు పూర్తిచేసి ఈ నెల 17 నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించారు.

Published : 29 Feb 2024 06:03 IST

బ్యారేజీ ఫుట్‌పాత్‌పై కాంక్రీటు వ్యర్థాలు

ధవళేశ్వరం, హుకుంపేట, న్యూస్‌టుడే: కాటన్‌ బ్యారేజీ రహదారి మరమ్మతులు పూర్తిచేసి ఈ నెల 17 నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించారు. మరమ్మతుల పనులు పూర్తయి పది రోజలు గడిచినా ఫుట్‌పాత్‌ మీద వేసిన సిమెంటు, కాంక్రీటు వ్యర్థాలను తొలగించకుండా వదిలేశారు. దాంతో పాదచారులు నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల మొనదేలిన ఇనుప చువ్వలు పైకి రావడంతో రాకపోకలు సాగించే వాహనచోదకులు ప్రమాదాల బారిన పడే అవకాశముంది. వాటిని తొలగించాలని కోరుతున్నారు.

ప్రమాదకరంగా మలుపు

కాటన్‌ బ్యారేజీ కూడలి నుంచి బ్యారేజీ పైకి వెళ్లేటప్పుటు ఎస్‌ ఆకార మలుపులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారి మరమ్మతుల అనంతరం వాహనాల వేగం పెరిగింది. దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారి మరమ్మతు పనుల్లో భాగంగా మలుపులో ఉన్న వేగనిరోధకాలను తొలగించారు. పనులు పూర్తయ్యాక తిరిగి వాటిని ఏర్పాటు చేయలేదు. దాంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేగనిరోధకాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

రహదారిపై చొచ్చుకొచ్చిన ఇనుప చువ్వలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని