logo

ఇష్టారీతిన తవ్వకాలు.. ఇవిగో సాక్ష్యాలు!

అడిగేవారు లేరు.. అడ్డుకునే వారు రారు.. అధికారం బలం... వెరసి గోదావరి నదికి ఇసుకాసురులు గర్భంశోకం మిగుల్చుతున్నారు. నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు.

Published : 29 Feb 2024 06:09 IST

మునికూడలి: గోదావరి పుష్కరాల రేవు వద్ద ఇసుక తవ్వకాలు

న్యూస్‌టుడే, సీతానగరం: అడిగేవారు లేరు.. అడ్డుకునే వారు రారు.. అధికారం బలం... వెరసి గోదావరి నదికి ఇసుకాసురులు గర్భంశోకం మిగుల్చుతున్నారు. నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలను ధిక్కరించి నదీ గర్భంలో ఇసుకను కొల్లగొడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో పరిస్థితికి అద్దంపట్టే చిత్రాలివి. సీతానగరం నుంచి పశ్చిమవైపు ఉన్న తాళ్లపూడి ప్రక్కిలంక కలిసేవరకు పలుచోట్ల ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. భూగర్భ, పర్యావరణ, రెవెన్యూ, పోలీసు, నిఘా విభాగాల కళ్లెదుటే అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్నందున చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నదిలోనే రహదారులు నిర్మిస్తున్నారు. అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలు పెట్టి తవ్వి తీరాన్ని తటాకాలుగా మార్చుతున్నారు. నదీపాయలకు అడ్డంకులు సృష్టించడంతో వరదలు వచ్చినప్పుడు ప్రవాహం దిశ మార్చుకుంటే తీరప్రాంతాలు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరికలు ఖాతరు చేయడం లేదు. రాత్రివేళ తవ్వకాలు చేయకూడదనే నిబంధన మచ్చుకైనా అమలు కావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని