logo

‘సీఎం గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదు’

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Published : 01 Mar 2024 02:18 IST

మంత్రి రాంబాబు

వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెదేపా-జనసేన పొత్తును ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ఉమ్మడి సభలో పవన్‌కల్యాణ్‌ మాటతీరు దారుణంగా ఉందన్నారు. చంద్రబాబును నమ్మి రాజకీయాల్లో బాగుపడిన వ్యక్తి ఒక్కరూ లేరని మంత్రి వ్యాఖ్యానించారు.

బి-ఫారం ఇచ్చేవరకు అభ్యర్థులు కారు

వైకాపా సమన్వయకర్తలంతా ఇన్‌ఛార్జులేనని, వీరు అభ్యర్థులు కావచ్చు..అక్కడక్కడ కాకపోవచ్చని అంబటి అన్నారు. బి-ఫారం వచ్చే వరకు సాంకేతికంగా ఎవరూ అభ్యర్థులు కాదన్నారు. బి.ఫారం ఇచ్చేటప్పుడు కొంచెం మార్పులు ఉండవచ్చన్నారు. ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా వైకాపాలో చేర్చుకుంటామని, టికెట్‌ ఇస్తారా? లేదా? అనేది సీఎం నిర్ణయమని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని